పిల్లలు రాత్రివేళ ఎక్కువ సేపు నిద్ర పోతారు కనుక వాళ్ళలో డీ హైడ్రేషన్ అవకాశాలు ఉంటాయి. అందుచేత ఉదయం వేళ వారికి ద్రవ పదార్థాలు ఆహారం అంటే టోమోటో జ్యూస్ వంటివి ఇవ్వటం మంచిది. ఉడికించిన టోమోటో లికొసిన్ అనే రసాయనం విడుదల చేస్తుంది అది పిల్లల ఎదుగుదలకు మంచిది. చర్మం బావుంటుంది కూడా అలాగే పిల్లల ఉదర ఆరోగ్యానికి పులియబెట్టిన పదార్ధాలు కూడా మంచివే .ఇవి శారీరక రోగనిరోధక వ్యవస్థకు బాగా సపోర్టు చేస్తాయి. ఇడ్లీ,దోసె వంటివి ఇవ్వచ్చు .విటమిన్ సి ఉండే ఆరెంజ్ ,యాపిల్ జ్యూస్ కూడా మంచివే.

Leave a comment