వాళ్ళని ఇరుగు పొరుగుల తోనో, తోబుట్టువుల తోనో పోలిక తెచ్చి అవమానించారా, ఇక పిల్లలు మీ మాట విననట్లే తెలుసుకోండి అంటారు ఎక్స్పర్ట్స్. పిల్లలు ఏదైనా నేర్చుకునే క్రమంలో పొరపాట్లు చేస్తారు. ఇక వెంటనే ఎప్పుడూ ఇలాగే తప్పులు చేస్తావనో, అన్న నీలాగా తప్పులు చేయడనో, చెల్లిని చూసి నేర్చుకోమానో ఎప్పుడూ అనకూడదు. వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే ఎక్కడ పొరపాటు చేశారో చెప్పి ఎలా సరిదిద్దుకోవాలో వివరించాలి. అదే వారిలో ఖచ్చితంగా మార్పు తీసుకొస్తుంది. అలాగే వారిని వారి అన్నదమ్ములతో, అక్కచెల్లెళ్ళతో పోలిక తెస్తే అనవసరంగా వారి మధ్య శతృత్వం కలిగించిన వాళ్ళు అవుతారు. అలాగే ప్రతి చిన్న పొరపాటుకు వెంటనే దండించటమూ తప్పే. అవమానించినా తప్పే. మాట్లాడే పరుషమైన మాటలు చిన్న పిల్లల మనసు గాయ పరుస్తాయి. అందుకే పిల్లలతో చాలా జాగ్రత్త అంటున్నారు చైల్డ్ సైకాలజిస్టులు.

Leave a comment