నీహారికా,

మనకు ఎం కావాలో మనకు తెలిస్తే జీవితంలో హాయిగా ఉండటం తెలుస్తుంది. కానీ మొదట మన సమాజం తల్లిదండ్రులు, కుటుంభ సభ్యులు, ఎవరి నమూనాలు వాళ్లు. పెరిగే వరకు పిల్లల పైన స్పష్టంచేసేందుకు ప్రయత్నిస్తారు. కొందరికి డబ్బు సంపాదన ఇష్టం, ఇంకొదరికి మంచి ప్రవర్తన అంటారు సహజం. నియమాలు పద్దతులు అంటారు. వీటిలో ఎదిగే పిల్లలు దేన్నీ తీసుకోవాలి. ఎవరి నమూనా తీసుకొని జీవితాన్ని ప్రారంభించినా చాలా తొందరలో మనకు కావాలసినది అనుభవంతో అందుతుంది. కానీ అప్పటికే కాలంతరం అవుతుంది . ఎవరి ఆశలు తీర్చెందుకో చాలా వయసు ఖర్చైపోయింది. అందుకే తల్లి దండ్రులు తమ పిల్లల విషయంలో ఈ అంశం గురించి తెలివిగా ప్రవర్తించాలి. ఎదిగే పిల్లలకు ఏది ఇష్టమో దేన్నీ వాళ్ళు మనస్పూర్తిగా సంతోషిస్తారో తెలుసుకొని మార్గ నిద్దేశం చేస్తే పిల్లలు హాయిగా ఆ దారిన నడిచి వాళ్ళ కనుగుణంగా వాళ్ళ జీవితాలను మడుచుకొంటారు. దీన్ని ఎంత మంది తల్లిదండ్రులు గుర్తిస్తున్నారు?

Leave a comment