నీహారికా , నేను పెరుగుతున్నప్పుడు నేనడిగిన ఏ ప్రశ్నకు సరైన సమాధానం అమ్మా నాన్నల దగ్గర నేను తెలుసుకోలేదు. నాలాంటి అమ్మాయిలంతా నాలాగే శరీరానికి సంబంధించిన విషయాల్లో అజ్ఞానంతో వుంటారు కనుకనే వాళ్ళు సులువుగా మోసపోతారని నువ్వన్నమాట మనసుని గాయం చేస్తోంది. నిజమే. పదేళ్ల వయసు వచ్చాక శరీరంలో చోటు చేసుకునే మార్పులు అకస్మాత్తుగా ఆడ మగ పిల్లల మధ్య కలిగే ఆకర్షణ పిల్లల మనసు అల్లకల్లోలం చేస్తాయి. సరైన లైంగిక ఒక్కటే వాళ్ళని ఆ స్థితి నుంచి బయట పడేస్తుంది భయాలు పోగొడుతుంది. లైంగిక విద్య గురించి అవగాహనా కల్పిస్తే ప్రయోగాలు చేస్తారనే మాట కేవలం అపోహ. మన సమాజం లోని విలువల్ని నేర్పేదే ఈ విద్య. మనం భోజనం చేయటానికీ రోడ్డు పై నడిచేందుకు కొన్ని విధులున్నాయి. శృంగారం కూడా ఇలాంటిదే ఇద్దరు వ్యక్తులు పెళ్లితో ఒక్కటై ప్రేమనే గోడల పై ఏకాంతంగా ఆస్వాదించే మాధుర్యమనీ పిల్లలు ఇంకో రకంగా ప్రవర్తించి జీవితం పాడు చేసుకోవద్దనీ తమ శరీరం విషయంలో శ్రద్ధగా ఉండమని చెడ్డ స్పర్శ ని దూరంగా వుంచమనీ ప్రేమకి ఆకర్షనికీ మధ్య వున్నతేడానీ పదే పదే పిలల్లకు చెప్పుకోవాలి. తల్లితండ్రులే పిల్లల గురువులుగా వాళ్ళకి వాళ్ళ గురించి చెప్పి హెచ్చరించాలి. వాళ్ళు ప్రతిదశ లోనూ తల్లితండ్రుల దగ్గర తమ సమస్యలకు చెప్పుకునేంత స్వేచ్ఛ తల్లితండ్రులు ఇవ్వాలి. అలా పిల్లలకు కాపాడుకోకపోతే కష్టం ఎవరికీ చెప్పు.
Categories
Nemalika

పిల్లలకి చెప్పకపోవటం తప్పే కదా

నీహారికా ,

నేను పెరుగుతున్నప్పుడు నేనడిగిన ఏ ప్రశ్నకు సరైన సమాధానం అమ్మా నాన్నల దగ్గర నేను తెలుసుకోలేదు. నాలాంటి అమ్మాయిలంతా నాలాగే శరీరానికి సంబంధించిన  విషయాల్లో అజ్ఞానంతో వుంటారు కనుకనే వాళ్ళు సులువుగా మోసపోతారని  నువ్వన్నమాట మనసుని గాయం చేస్తోంది. నిజమే. పదేళ్ల వయసు వచ్చాక శరీరంలో చోటు చేసుకునే మార్పులు అకస్మాత్తుగా ఆడ మగ పిల్లల మధ్య కలిగే ఆకర్షణ పిల్లల మనసు అల్లకల్లోలం చేస్తాయి. సరైన లైంగిక ఒక్కటే వాళ్ళని ఆ స్థితి నుంచి బయట పడేస్తుంది భయాలు పోగొడుతుంది. లైంగిక విద్య గురించి అవగాహనా కల్పిస్తే ప్రయోగాలు చేస్తారనే మాట కేవలం అపోహ. మన సమాజం లోని విలువల్ని నేర్పేదే ఈ విద్య. మనం భోజనం చేయటానికీ  రోడ్డు పై నడిచేందుకు కొన్ని విధులున్నాయి. శృంగారం కూడా ఇలాంటిదే ఇద్దరు వ్యక్తులు పెళ్లితో ఒక్కటై ప్రేమనే గోడల పై ఏకాంతంగా  ఆస్వాదించే మాధుర్యమనీ పిల్లలు ఇంకో రకంగా ప్రవర్తించి జీవితం పాడు చేసుకోవద్దనీ  తమ శరీరం విషయంలో శ్రద్ధగా  ఉండమని చెడ్డ స్పర్శ ని దూరంగా వుంచమనీ ప్రేమకి ఆకర్షనికీ మధ్య వున్నతేడానీ  పదే పదే పిలల్లకు చెప్పుకోవాలి. తల్లితండ్రులే  పిల్లల గురువులుగా వాళ్ళకి వాళ్ళ గురించి చెప్పి హెచ్చరించాలి. వాళ్ళు ప్రతిదశ లోనూ తల్లితండ్రుల దగ్గర తమ సమస్యలకు చెప్పుకునేంత  స్వేచ్ఛ తల్లితండ్రులు  ఇవ్వాలి. అలా  పిల్లలకు కాపాడుకోకపోతే  కష్టం ఎవరికీ చెప్పు.

Leave a comment