ఎదుగుతున్న చిన్న పిల్లల విషయం ఎప్పుడూ శ్రద్ధ తీసుకొవాల్సిందే. ఎప్పుడూ వాళ్ళ వెనకే వుండి కనిపెట్టడం చాలా కష్టం. అందుకే వాళ్ళకు ఇతరులతో చొరవగా మాట్లాడటం , అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలో నేర్పాలి. అప్పుడే మనో ధైర్యంగా వుండ గలుగుతాం. మొట్ట మొదటగా వాళ్ళకి నేర్పల్సింది అపరిచితుల దగ్గరికి వెళ్లొద్దు, పిలిచినా, ఏవైనా తినుబండారాలు ఇస్తానన్నా, కార్లో, స్కూటర్ పైనో షికారు తిప్పుతానన్నా రాను అని చెప్పాలని, వాళ్ళు బలవంతం చేస్తే గట్టిగ అరవాలని నేర్పించాలి. ముందుగా ఎలాంటి తినుబండారాలు ఇచ్చినా తీసుకోకూడదు అని అర్ధం అయ్యేలాగా చెప్పాలి.అలాగే మతలోస్తున్నప్పటి నుంచి ఇంటి అడ్రస్, అమ్మానాన్నల పూర్తి పేరు, ఇద్దరు చేస్తున్న ఉద్యోగాలు, ఫోన్ నెంబర్లు వాళ్ళ నోటికి వచ్చేలా నేర్పాలి. బట్టి పట్టించాలి. రోడ్లపై ఎలా నడవలో, బస్సులు ఎలా ఎక్కే విధానం, టికెట్ కౌంటర్, ఒక వేల తప్పిపోతే ఇంటికెలా రావాలో దగ్గరుండి నేర్పాలి. స్కూలూకు వెళ్ళే పిల్లలకు, వేరే ఎవరైనా వచ్చి మీ ఇంట్లో వాళ్ళు రమ్మన్నారని చెపితే వెంటనే నమ్మద్దని చెప్పండి. మానం పక్కనుండి వాళ్ళు ఇవన్నీ సొంతగా చూసి తీర్పు ఇవ్వాలి.

Leave a comment