Categories
WhatsApp

పిల్లలకు కధలు చెప్పడం నేర్పండి.

ఈ సెలవులు పూర్తి అయ్యే లోపు స్కూళ్ళు వుండవు గనుక పిల్లలకు ఇంట్లో ఎన్నో విషయాలు చెప్పే విలుంటుంది. అలాగే మంచి పనులు కూడా నేర్పొచ్చు. ముందుగా వాళ్ళకోసం రెండు గంటలు కేటాయించి స్టోరీ టెల్లింగ్ మొదలెట్టవచ్చు. మనం ఓ కధ చెప్పి పిల్లల్ని అలాగే వాళ్ళకొచ్చిన భాషలో తిరిగి చెప్పేలా నేర్పాతే. ముందుగా వాళ్ళకు స్టేజ్ ఫియర్ పోతుంది. చుట్టు పక్కల పిల్లలని ఒక్క చోట చేర్చి ఈ కధలు చెప్పించా గలిగితే ముందుగా వాళ్ళ నాలెడ్జ ఏ స్థాయి లో వుందో మనం తలుసుకోవచ్చు. అలాగే స్పెల్లింగ్స్ చెప్పించడం, ఫజిల్ గేమ్స్ ఆడించడం వల్ల వాళ్ళకి సెలవులు సద్వినియోగం చేసుకున్నట్లు అవుతుంది. పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నట్లు అయితే వాళ్ళకి తెలుగు నేర్పించా వచ్చు. నెట్ లో సైన్స్ కి సంబందించినవి, వైల్డ్ లైఫ్ కి సంబందించిన ప్రోగ్రాములు చూపించొచ్చు. ఎటొచ్చి ఈ రెండు నెలలు తల్లిదండ్రులు పిల్లల కోసం ఓర్పుగా టైమ్ కేటాయిస్తే చాలు, స్కూళ్ళు తెరిస్తే చాలు పిట్టల్లాగా, పువ్వుల్లాగా స్కూలుకెళ్ళిపోతారు. ఈ సంవత్సరం పాటు వాళ్ళు ఏం నేర్చుకున్నారో ముందు మనం తెలుడుకోగాలిగే అవకాశం ఇదే.

Leave a comment