నీహారికా,

ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలుంటే తెలిసో, తెలియకో అనాలోచితంగానో ఫలానా వాడంటే అమ్మా కి ఇష్టమనో , వీడు నాన్న పెట్ అనో సరదాగా పెద్ద వాళ్ళు అనేస్తారు. అయితే అమ్మకు ఇష్టం అనిపించుకున్న పిల్లలు తల్లి దండ్రులతో వున్న అనిబందాన్ని ద్రడంగా వుంచుకుంటే, అమ్మా నాన్నకి నేనేమ్తే ఇష్టం లేదని తీర్మానిమ్చుకున్న పిల్లలు మానసికంగా చాలా కుంగి పోతారు, నష్టపోతారు అంటున్నాయి అద్యాయినాలు. అలాగే పెద్ద పిల్లల్ని చూసి నేర్చుకో అని చిన్న వాళ్ళతో ఒక అబధరతా భావం ఏర్పడుతుందని, తామం కంటే పెద్దవాళ్ళ పైన ఆ కారణంగా కోపం తెచ్చుకుంటారని చెప్పుతున్నారు. ఇది మనస్సు లోకి తీసుకోవలాసిన అంశం. పిల్లల తో చాలా జాగ్రత్తగా వుండాలి. ‘ఇష్టం’ అన్న పదాన్ని చాలా ఆలోచించి ఉపయోగించాలని పిస్తుంది కదూ. వాళ్ళను చూసి నేర్చుకో అన్న మాట పిల్లలకు అస్సలు నచ్చదని గుర్తు పెట్టుకోమ్మంటున్నారు నిపుణులు.

Leave a comment