ఆరాధ్య కు ఆ రోజు చెవులు కుట్టే వేడుక జరుగుతోంది. నా చిన్నారి పాప ఒక్కతే ఆ నొప్పిని భరిస్తూ ఉండటం నేను చూడలేక పోయాను పాప తో పాటు ఆ నొప్పి నేను భరించేందుకు సిద్ధ పడ్డాను. ముందుగా నేను కుట్టించు కొన్నాను ఆరాధ్య ధైర్యంగా నా వైపు చూసింది.పాపాయి తో నా జీవితం ఎంతో అమూల్యంగా అనిపించిందో నేను చెప్పలేను.అన్నాడు అభిషేక్ బచ్చన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆడపిల్లలు ఉండటం ఒక అదృష్టం.వాళ్లకు చిన్నపాటి అసౌకర్యం అయినా తండ్రిగా నేను కలుగనివ్వను.ఆమె జీవితంలో నేను కంఫర్ట్ జోన్ గా లీడర్ గా ఉండాలనుకొంటాను.ఆమెను ఉత్సాహ పరిచేందుకు నేను ఎలాంటి పని అయినా ఒప్పుకుంటాను నా కూతురు ఒంటరిగా నొప్పిని భరించేందుకు నేనెందుకు అనుమతి ఇవ్వాలి.ఆడపిల్లలు మన జీవితంలో అపురూపమైన వాళ్లు అంటున్నారు అభిషేక్ బచ్చన్.

Leave a comment