నీహారికా,

పిల్లలు నేర్చుకునే  దశలో ఎదుగుతూ తల్లిదండ్రులనే రోల్ మోడల్స్గా తీసుకుంటారనేడి ఇవ్వాళ మనం అనుకున్న ధియరా కాదు. ఇప్పుడు అలాగే జరుగుతంది. పేరెంట్స్ నే  వాళ్ళు ఇప్పుడు అనుకరిస్తారు కనుక ముందుగా ఇంట్లో పెద్ద వాళ్ళు పిల్లలు పెరుగుతున్నాక వాళ్ళ తీరు తెన్నులే మార్చుకోవాలి. అబద్దాలు చెప్పడం, మోసం చేయడం, వ్యాపారంలో దగా, ఆఫీసుల్లో దొంగతనాలు ఇవన్నీ పెద్దలు చేస్తేనే పిల్లలకు అలవాటు అయ్యే ప్రమాదం వుంది. ఎదినా ఆఫీసు లో జరిగిన విషయం ఇంట్లో చెప్పేటప్పుడు ఇది మన ఇమేజ్ ని పిల్లల ద్రుష్టిలో పెంచుతుందా, మనల్ని పాతాళంలో దింపుతుందా అని పెద్దవాళ్ళు ఆలోచించుకోవాలి. తల్లి దండ్రులు ఒకళ్ళనొకళ్ళు పరుష పదజాలం తో దోషించుకుంటూ వుంటే అదేం పెద్ద తప్పు కాదని పిల్లలు హాయిగా ఫాలో అయిపోతారు. ఎప్పుడైనా కోపం లో ఓ మాట జారినా పిల్లలకు వెంటనే తమ కోసం ఎందుకు వచ్చిందో, ఏ ఉద్రేకం ఆపుకోలేక అలా మాట్లాడేమో చెప్పుకోకపోతే పిల్లలు అచ్చంగా మన ప్రతి బిమ్బాలే కనుక వాళ్ళు యధేస్యగా ఏ భూతులైనా వుపయోగిస్తారు. ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సింది పేరెంట్సే.

Leave a comment