చిన్నపిల్లలు అతి గా మాట్లాడుతున్నఅరింద్రల్లా వయసుకు మించి వ్యవహరిస్తున్న పెద్ద వాళ్లు వెంటనే దానికి అడ్డుకట్ట వేయాలి. అంటున్నారు చైల్డ్ సైకాలజిస్ట్ లు.అలా మాట్లాడటం వాళ్ల తెలివి తేటలు గా లెక్క వేస్తే చేతులారా వాళ్ళ బాల్యాన్ని చిదిమేస్తున్నామని అర్థం చేసుకోమంటున్నారు పెద్దవాళ్లు. ప్రతి విషయాన్ని పిల్లలతో పంచుకోకూడదు వారి వయస్సుకు తగ్గ అవసరమైనవి మాత్రమే చెప్పాలి లేకపోతే పెద్ద వాళ్ళ ఆలోచనలు వాళ్ళ చిన్న బుర్రల్లోకి బలవంతంగా చొరబడి,వాళ్లు కూడా పెద్ద వాళ్ళ లాగే ఆలోచించటం మొదలు పెడతారు.వాళ్లకు నిర్ణయం తీసుకునేంత లోకజ్ఞానం ఉండదు.దీని వల్ల నష్టం జరుగుతుంది. పిల్లలు పెద్ద వాళ్లను అనుసరించ గలరు. కానీ వాళ్లలా వ్యవహరించలేరు.ఆలోచించలేరు.సరైన దిశగా అడుగులు వేయలేరు అందుకే వాళ్లని సరైన రీతిలో గైడ్ చేయండి అంటున్నారు.

Leave a comment