నీహారికా,

ఇంట్లో టీనేజ్ పిల్లలుంటే వాళ్ళతో స్నేహం చేసి వాళ్ళ మనస్సు తెలుసుకుని వాళ్ళ సమస్యలకు పరిష్కారం సుచించడం తల్లి దండ్రుల పైనే అంటున్నాయి అద్యాయినాలు వ్యక్తిగత విషయాలు మాట్లాడేందుకు వాళ్ళకు మొహమాటం వుంటుంది. తల్లిదండ్రులు ఈ మొహమాటం పోయేలా వాళ్ళతో సన్నిహితంగా మెలిగి, తమకంటే ఇంకెవ్వరూ వాళ్ళకి దగ్గర కాదని ధైర్యం చెప్పగలగాలి. పిల్లలు ముందుగా తల్లిదండ్రులను నమ్మాలి. అంటే పెద్దవాళ్ళు స్నేహితుల్లా ప్రవర్తించాలి. ఎదినా సమస్య చెవిన పడగానే అరిచి కాపాడటం, ఎదో జరిగిపోయిందాని ఏడుపు మొహాలు పెట్టుకోవడ, లేదా వాళ్ళని తిట్టడం ఇవన్నీ తెలియక చేసే పనులు. ఈ కాలపు పిల్లలతో ఈ కాలపు తల్లిదండ్రులలాగా మెలగాలి. వాళ్ళ స్ధాయి లో ఆలోచించాలి. వాళ్ళ స్నేహితుల మధ్య, వాళ్ళు మెలిగే వాతావరణం లో ఎలాంటి సమస్యలు రావచ్చో, తల్లిదండ్రులు ఆలోచించాలి. అప్పుడు స్నేహంగా, ప్రేమగా ఎంతో ధైర్యం ఇచ్చి వాళ్ళ ప్రోబ్లం తెలుసుకుని, పరిషార దిశగా వాళ్ళతో కలిసే అడుగులు వేయాలి. అప్పుడే పిల్లలు భద్రంగా వుంటారు.

Leave a comment