Categories
WhatsApp

పిల్లలు నోచ్చుకుంటున్నారేమో?

సోషల్ మీడియా అప్డేట్స్  చేసే సమయంలో, ట్విట్టర్ లో సొంత విషయాలు పోస్ట్ చేసే సమయంలో ఇంట్లో వుండే పిల్లల గురించి ఓ సారి ఆలోచించ మంటున్నారు ఎక్స్ పర్ట్స్. మనం చేసే ప్రయాణాలు, కలిసే ఫ్రెండ్స్, చేసే భోజనాలు అన్నీ పోస్ట్ చేయడం ఇప్పటి హాబీ. కానీ వ్యక్తిగత విషయాలు పోస్ట్ చేసే సమయంలో పిల్లలు వాటి గురించి ఏమనుకొంటున్నారో ఆలోచించాలి. తల్లిదండ్రుల వ్యక్తిగత విషయాల పై చర్చ జరగడం పిల్లలు ఒర్చుకోరు. అలంటి విషయాలు స్కూల్లో పక్కపిల్లలు మాట్లాడుకోవడం వాళ్ళకి ఇష్టం వుండదు. తల్లిదండ్రులు ప్రతి బిడ్డకు ఆదర్శ మర్ఘాలే. వాళ్ళ గురించి ఎవ్వరూ చులకన చేసినా వాళ్ళు సహించ లేరు. అటువంటి అవకాశం ఇచ్చిన తల్లిదండ్రుల పై కోపం తెచ్చుకుంటారు. అలాగే మన పిల్లలే కదా అని వాళ్ళ ఫోటోలు వాళ్ళ గురించి మన ఇష్టమైనవి పోస్ట్ చేయడం చాలా తప్పు. మనం పెట్టే పోస్ట్ వాళ్ళ ఇమేజ్ దేబ్బదీసేదిగా ఉండకూడదు.

Leave a comment