ఇల్లు పీకి పందిరేసే మాట పిల్లల విషయంలో ఎంతో నిజాం పాపం వాళ్ళు తెలియకే గోల చేస్తారు, విసిగిస్తారు భరించలేక ప్రాణం విసిగిపోయి నాలుగు ఉతకడం పెద్దలు చేసే పనే కానీ అలా కొట్టుకండి దెబ్బ చిన్నదైనా, పెద్దదైనా పిల్లల పైన ప్రభావం చూపెడుతుంది అంటున్నారు అధ్యాయినకారులు పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళు మనల్ని ఎదురించి తిరిగి కొట్టలేరు బలహీనులని వాళ్ళని కొట్టేందుకు మనం వెనకాడక పొతే ఆ అనుభవంతో పిల్లలు పెద్దయ్యాక తాము చెప్పిందే కరక్టని నిరూపించడం కోసం వాళ్ళ పిల్లల్ని కొడతారు. పిల్లలకు పెద్దలకు వుండే మంచి సంబందాలు ఈ కొట్టే దెబ్బలతో పోతాయి. తల్లిదండ్రుల చేతిలో దెబ్బలు తింటూ పెరిగే పిల్లలు తమ జీవితాల్లో మానవ సంబందాల సమస్యల్ని ఎదుర్కొంటారు వాళ్ళు చిన్నప్పుడు తమను చీటికి మాటికి దండించే తల్లిదండ్రులను నమ్మరు పెద్దయ్యాక ఇంకెవరినీ నమ్మరు.

Leave a comment