ప్రపంచంలోని అందమైన అద్భుతమైన సరస్సుగా చెపుతారు ఆస్ట్రేలియా లోని లేక్ హిల్లర్ ను. అన్ని సరస్సులో నీరు తెల్లగా వుంటే ఈ సరస్సు లోని నీరు పింక్ కలర్ లో వుంటుంది. సరస్సులో చూస్తుంటేనే కాదు ఆనీళ్ళను గ్లాస్ లోకి తీసుకున్న అదే రంగులో వుంటాయి ఇవేమి రసాయనాలు కూడా కాదు చాలా సురక్షితమైన నీరు ఇది. ఈ సరస్సులో ఉండే సూక్ష్మ జీవులే ఈ నీటిని ఆ రంగులోకి మార్చేశాయి. నీటిని గులాబీ రంగు లోకి మార్చే ఓ సూక్ష్మ జీవి నీటిలో గల లవణాలుతో చర్య జరపటం వల్ల. నీటికి పింక్ కలర్ వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

Leave a comment