అన్ని రకాల పండ్లను అలవాటుగా పై తొక్క వలిచి తింటూ వుంటాం. ఆపిల్ పై పోర పల్చుగా వున్నా దాన్ని తీసేసి ముక్కలు చేస్తాం. కానీ ఆపిల్ పండులో కంటే పై తొక్కలో 75 శాతం కెర్సిటిన్ అనే ఫ్లేవనాయిడ్ ఉంటుందిట. ఇది కాన్సర్ తో పోరాడే జీవ రసాయినం. అలాగే విటమిన్ సి, ఫోలెల్, నియాసిన్ వంటి విటమిన్లు నీళ్ళలో కరుగుతాయి. అందుకే ఆకు కూరలను తగు మోతాదులో ఉడికించాలి. అలాగే వీటిని వుడికించే నీటిని పారబోసినా అందులో వుండే కూరగాయలను ఆలివ్ నూనెలో నీళ్ళు లేకుండా మగ్గనివ్వటంమంచిదంటారు ఎక్స్ పర్ట్స్. ఆకు కూరలను ఎక్కువ సేపు వండితే వాటిలో లభ్యమైయ్యె పోషకాలు ఫైటో కెమికల్స్ తరిగిపోతాయి. వీటన్నింటినీ సరైన పద్దతిలో వంద గలిగితే శరీరానికి ఉపయోగం.

Leave a comment