పోషకాలు పుష్కలంగా ఉండే మైక్రో గ్రీన్స్ ఇంట్లో పెంచుకోవడం చాలా తేలిక ఇందుకోసం ఓ మోస్తారు ట్రే, కోకోపీట్ కొద్దిగా సేంద్రియ ఎరువు కావాల్సిన విత్తనాలు ఉంటే చాలు ఇంట్లో దొరికే ధనియాలు,మెంతులు,అవిసె, సోంపు వంటివి పెంచుకోవచ్చు ముందు రోజు విత్తనాలు నానబెట్టి మరుసటి రోజు చల్లుకుంటే త్వరగా మొలకెత్తుతాయి. వీటిని రెండు అంగుళాల ఎత్తు ఎదిగాక కత్తిరించుకుంటే  సరిపోతుంది.మెగ్నీషియం, మాంగనీస్, ఇనుము వంటి సూక్ష్మ పోషకాలు అందాలంటే ఈ మైక్రో గ్రీన్స్ ని ఎక్కువ వేడి చేయకూడదు ఈ పోషకాలు నిండుగా ఉండే ఈ లేత మొక్కల్నివేడి చేయకుండా అల్పాహారాలు సలాడ్స్ రైత స్మూథీల్లో నువ్వు ల్లో నేరుగా వాడుకోవచ్చు. నిమ్మరసం చల్లి తినటం వల్ల వాటిలోని పోషకాలు పూర్తిస్థాయిలో శరీరానికి అందుతాయి.

Leave a comment