మట్టిలో,లేదా వట్టి నీళ్ళలో మొక్కల్ని పెంచినట్లు ఇప్పుడు చిట్టి చిట్టి పూసలతో మొక్కలను పెంచే ప్రక్రియ కనిపెట్టారు . వాటర్ బీట్స్,లేదా జల్లీ బీడ్స్ ,పాలిమర్ బీడ్స్ గా పిలిచే ఈ చిన్ని పూసలతో మొక్కలను పెంచుతున్నారు . ఈ చిన్ని పూసలు నీళ్ళలో వేస్తే అవి నీళ్ళను పీల్చుకొని స్పాంజిలాగా వాటి బరువు కన్నా వందరెట్లు ఎక్కువ బరువుకి ఉబ్బుతాయి . ఒక టేబుల్ స్పూన్ పూసలు పది కప్పుల నీళ్ళు పీల్చుకో గలవు . మట్టి బదులుగా ఈ పూసలు అందమైన కుండల్లో వేసి మనీ ప్లాంట్ ,గోధుమ గడ్డి ,బీట్ రూట్ ,బ్రకోలి మోంతీ పెసలు ,క్యాబేజ్ లగే వెదురు ,ప్రేయర్ పేపరొనియా వంటి అందం కోసం పెంచే మొక్కల్లో మొక్కల్ని కూడా పెంచుకోవచ్చు . ఈ పూసలు కొన్ని గులక రాళ్ళూ ఉంటె చాలు మొక్క చక్కగా పెరుగుతుంది .

Leave a comment