పిల్లల పాల సీసాల్లో అంటే ప్లాస్టిక్ తో చేసిన సీసాల్లో వుండే బి సి ఎస్ అంటే బిస్ ఫినాల్ అనే పదార్ధం పిల్లల అనారోగ్యం పైన తీవ్ర ప్రభావం చూపిస్తుందని పరిశోధనలు చెపుతున్నాయి. ఇది కొంచెం వింతగా ఉన్నా నిజమే అంటున్నారు పరిశోధకులు. ఈ ప్లాస్టిక్ సీసాలతో పాలు తాగిన పిల్లలతో పెద్దయ్యాకఆస్తమా సంతానలేమి డయాబెటిక్ వంటి ఆరోగ్య సమస్యల తలెత్తే ప్రమాదం వుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిశోధన కోతులపైనా చేశారట . ఈ బిపి ఎస్ రసాయనం కోతుల్లోకి పంపిన అనంతరం తల్లి కోతుల్లో విపరీతమైన మార్పు వచ్చిందట. ఈస్ట్రోజెన్ హార్మోన్ పైన ఈ రసాయనం విపరీతమైన ప్రతికూల ప్రభావం చూపించటం వారి దృష్టికి వచ్చిందట. అంచేత ఈ విషయం దృష్టిలో ఉంచుకుని ప్లాస్టిక్ సీసాల బదులు గాజు లేదా స్టీలు సీసాలు ఎంచుకోమని చెపుతున్నారు పరిశోధకులు.
Categories
WhatsApp

ప్లాస్టిక్ పాల సీసాలతో అనారోగ్యం

Leave a comment