పిజ్జాలు,బర్గర్ లు ప్రాసెసింగ్ సమయంలో వాటి ప్యాకేజ్ మెటీరియల్ లో రసాయనాలు కలిపి థలేట్స్ అనే విషపూరితమైన రసాయనం పోట్టలోకి చేరుతంది అంటున్నారు అమెరికాలోని జార్జీ వాషింగ్టన్ యానివర్సిటీ అధ్యయనకారులు. 10,253 మందిపై చేసిన పరిశోధనలో రెస్టారెంట్ నుంచి పిజ్జా,బర్గర్ ,శాండ్ విచ్ లు ఆర్డర్ ఇచ్చి తెప్పించుకొని తినే వారిలో థలేట్స్ తాలూకూ అవశేషాలు కనిపించాయట. ఈ రసాయన ప్రభావం శరీరం బరువుపైన ,హార్మోన్ల లోనూ  ప్రమాదకరమైన మార్పులు చూపిస్తుందని పరిశోధకులు చెపుతున్నారు. బయట తయారు చేసే భోజన పదార్ధాల్లో నిలువ ఉండేందుకు కలిపే ప్రిజర్వే షన్స్ , ప్యాకింగ్ లో కలిపే రసాయనాలు అనారోగ్యాన్ని తెచ్చిపెడుతున్నాయని రిపోర్ట్స్ వెల్లడి చేశారు.

Leave a comment