పొడవుగా కనిపించాలంటే కొన్ని డ్రెస్సింగ్ మెళుకువలు పాటించమంటున్నారు స్టయిలిస్ట్ లు అర్ద బారులున్న వస్త్రాలు అసలు వద్దు వర్టికల్ ప్రింట్స్ అయితే పొడవుగా నాజూగ్గా కనిపిస్తారు. కాంట్రాస్ట్ కలర్ కంటే మ్యాచింగ్ వల్ల పొడవుగా అనిపిస్తారు. ఫుల్ లెంత్స్ షర్టుల కంటే షార్ట్ షర్టులు లు పొడవుగా ఉన్న బ్రాంతి కలిగిస్తాయి. దుస్తులు శరీరానికి అంటి పెటుకునట్లుగా ఉండాలి. చోకర్ నెక్ పీస్ లు కాకుండా పొడవాటి నెక్లెస్ లు పెండెంట్స్ పెట్టుకోవాలి హై హీల్స్ తప్పనిసరి. బోల్డ్ ప్రింట్స్ కాకుండా చిన్న చిన్న ప్రింట్స్ బావుంటాయి.

Leave a comment