కొందరికి పొడి చర్మం ఉంటుంది.అలా కాకుండా సహజంగా ఉండే నూనెలు కోల్పోతే పొడి బారిన చర్మం సమస్య వస్తుంది. ఎక్కువగా వేడి నీటి స్నానం చేసినా ఈ సమస్య వస్తుంది. ఇలా తేమ తగ్గిన చర్మం డల్ గా ,కాంతి హీనంగా అయిపోతుంది. ఇలాంటి సందర్భంలో స్నానం చేయగానే వళ్ళు సరిగా ఆరిపోక ముందే శరీరానికి, మొహానికి మాయిశ్చరైజర్ అప్లైయ్ చేయాలి. కొంత వరకు ప్రయోజనం కనిపిస్తుంది. అలాగే ఆయిల్ ఆధారిత నైట్ క్రీమ్ తప్పని సరిగా వాడాలి. జిడ్డు చర్మం గలవారైతే అనేక ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్లు దొరుకుతాయి. చర్మానికి సూటయ్యే దాన్ని ఎంపిక చేసుకొంటే సమస్య ఉండదు.

Leave a comment