అమ్మాయిలకు కుర్తీలెప్పుడూ బావుంటాయి. చీరలు వెస్ట్రన్ టైప్ దుస్తులకంటే కుర్తీలు సౌకర్యంగా చూసేందుకు చాలా బావుంటాయి . అయితే కుర్తీలు సింథటిక్ కంటే నూలు లినెన్ తరహావి అయితే తేలికగా చెమటలు అతుక్కుపోకుండా ఉంటాయి. పొదుపుగా సన్నగా కనిపించాలనుకుంటే మోకాళ్ళు దాటినా పొడవాటి కుర్తీలు ఎంచుకోవాలి. నేలకు జారాడుతూ వుండే అనార్కలీ ఫ్యాషన్ ఇప్పటి  ట్రెండ్. ఈ డ్రెస్ లో పొడుగ్గా కనిపంచాలంటే సరైన ఎతైన హీల్స్ వేసుకోవాలి . లైనింగ్ ఉన్న కుర్టీలయితే  పల్చగా కనిపించకుండా లోపలి దుస్తులు పైకి తెలియకుండా ఉంటాయి. చుడీదార్ లో కుర్తీలు విషయంలో చేతుల ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్లీవ్ లెస్ మెగా స్లీవ్స్ నిండు చేతులు త్రీ ఫోర్త్ లు శరీర ఆకృతిని బట్టి ఎంచుకోవాలి. కొందరికి  చేతులు లావుగా ఉంటే అప్పుడు స్లీవ్ లెస్ బావుండవు. పొడవాటి చేతులు ఉండాలంటే నెట్ షిఫాన్ జార్జెట్ వస్త్రశ్రేణి ఎంచుకుంటే కుర్తీలకు అందం వస్తుంది.

Leave a comment