పొడుగ్గా కనిపించాలి అని అందరికి ఇష్టమే. కానీ అందరూ పుట్టుక తో పొడవుగా ఉండరు కదా. కానీ వస్త్ర ధారణతో పొడువుగా కనిపించేలా నిపుణులు ఎన్నో సలహాలిస్తున్నారు. వినెక్స్ వల్ల కాళ్ళు నిలువుగా సాగి పొడవుగా వున్న బ్రాంతి కలుగుతుంది. బోల్డ్ ప్రింట్స్ కాకుండా చిన్న చిన్న ప్రింట్స్ ఎంచుకోవాలి. అడ్డ చరలున్నా వస్త్రాలకు దూరంగా వుండాలి. వెర్టికల్ ప్రింట్స్ అయితే పొడవుగా నాజుకుగా వుంటారు. కాంట్రాస్ట్ కలర్ కంటే మాచింగ్ గా వేసుకుంటే పొడవుగా అనిపిస్తారు. తక్కువ ఎత్తు వుంటే స్కర్టులు సూట్ అవ్వవు. మిడ్, ఫుల్ లెంగ్త్ స్కిర్టులు అస్సలే వద్దు. ఇవి బొద్దుగా ఉన్నట్లే చూపెట్టడం వల్ల ఎత్తు తక్కువగా కనిపిస్తారు. హై వెస్ట్ స్కిర్ట్లు మంచి ప్రత్యామ్నాయం. శరీరానికి అంటి పెట్టుకుని వుండే దుస్తుల్లో పొడవుగా వుంటారు. స్కార్ఫ్ ను మెడకు చుట్టి కట్టడం కంటే కిందకు వేలాడదిస్తే బావుంటారు. చొకార్  నెక్ పిసుల్ని కాకుండా పొడవాటి నేక్లెస్లు పెండెంట్స్ ఎంచుకోవాలి. హీల్స్ చెప్పల్సే ధరించాలి. ఇలాంటి చిన్న ట్రిక్స్ తో పొడవుగా కనిపించ వచ్చు.

Leave a comment