నీహారికా, పొదుపు అన్న పదం విన్నా, దాని గురించి ఉపన్యాసాలు విన్నా బోర్ కొట్టేస్తుంది అంటావు నిజమే. మరి చేతికి అందిన ఆదాయం నిమిషాల్లో ఖర్చు చేయడం ఈజీనే నిహారికా. మరి పొదుపు గురించి తెలిసి వుండాలిగా. ఆర్ధిక ఇబ్బందులు ఎదురయితే పొదుపే కదా కాపాడేది. చిన్నప్పటి నుండి పొదుపు పాఠాలు నేర్చుకోవాల్సిందే. అప్పుడే పెద్దయ్యాక సంపాదించే మొత్తంలో ఇంత పొదుపు కోసం అని పక్కన పెట్టడం చేతనవుతుంది. నెల జీతం అందుకోగానే ఖర్చుల వివరాలు పక్కన రాసుకోవాలి. వాడిన ప్రతి రూపాయి ఎందుకోసం ఉపయోగిస్తున్నామో o చోట రాసుకొంటే నెల తిరిగే సరికి ఖర్చుల పైన, వృధా పైన ఒక అవగాహన వస్తుంది. అప్పుడే ఎక్కడ పొదుపు చేయాలో అర్ధం అవుతుంది. తీరికుంటే, చేతిలో డబ్బుంటే స్నేహితులతో కలిసి షాపింగ్ కోసం వెళ్లేముందే అసలు బడ్జెట్ ఎంతో ముందే అనుకోవాలి. సరైన వస్తువు కొనుక్కోవాలంటే క్రెడిట్ కార్డు వాయిదా పద్ధతి బాగానే ఉంటుంది. కానీ దానికి ముందే ఆ వస్తువు కొనే డబ్బు పొదుపు చేసి అప్పుడు కొనాలి. అప్పుడే అదనపు భారం, వడ్డీ రేట్ల బాధ తప్పుతాయి. ఖర్చు అదుపు తప్పకుండా వుంటుంది. అందుకే జీవితంలో మొదటి అడుగులు వేసేప్పుడే అంటే చిన్నప్పుడే పిల్లలకు పొదుపుగా అంటే దుబారా లేకుండా ఎలా జీవించాలో నేర్పడం తల్లిదండ్రుల బాధ్యత అనుకొంటాను. కష్టపడి తెలివితేటలతో సంపాదించే డబ్బుని అప్పుడే ఎంజాయ్ చేయడం చేతనవుతుంది లేకపోతే డబ్బు దుబారా కావడం ఖాయం.
Categories
Nemalika

పొదుపు నేర్చుకుంటేనే దుబారాకు కళ్ళెం

నీహారికా,

పొదుపు అన్న పదం విన్నా, దాని గురించి ఉపన్యాసాలు విన్నా బోర్ కొట్టేస్తుంది అంటావు నిజమే. మరి చేతికి అందిన ఆదాయం నిమిషాల్లో ఖర్చు చేయడం ఈజీనే నిహారికా. మరి పొదుపు గురించి తెలిసి వుండాలిగా. ఆర్ధిక ఇబ్బందులు ఎదురయితే పొదుపే కదా కాపాడేది. చిన్నప్పటి నుండి పొదుపు పాఠాలు నేర్చుకోవాల్సిందే. అప్పుడే పెద్దయ్యాక సంపాదించే మొత్తంలో ఇంత పొదుపు కోసం అని పక్కన పెట్టడం చేతనవుతుంది. నెల జీతం అందుకోగానే ఖర్చుల వివరాలు పక్కన రాసుకోవాలి. వాడిన ప్రతి రూపాయి ఎందుకోసం ఉపయోగిస్తున్నామో o చోట రాసుకొంటే నెల తిరిగే సరికి ఖర్చుల పైన, వృధా పైన ఒక అవగాహన వస్తుంది. అప్పుడే ఎక్కడ పొదుపు చేయాలో అర్ధం అవుతుంది. తీరికుంటే, చేతిలో డబ్బుంటే స్నేహితులతో కలిసి షాపింగ్ కోసం వెళ్లేముందే అసలు బడ్జెట్ ఎంతో ముందే అనుకోవాలి. సరైన వస్తువు కొనుక్కోవాలంటే క్రెడిట్ కార్డు వాయిదా పద్ధతి బాగానే ఉంటుంది. కానీ దానికి ముందే ఆ వస్తువు కొనే డబ్బు పొదుపు చేసి అప్పుడు కొనాలి. అప్పుడే అదనపు భారం, వడ్డీ రేట్ల బాధ తప్పుతాయి. ఖర్చు అదుపు తప్పకుండా వుంటుంది. అందుకే జీవితంలో మొదటి అడుగులు వేసేప్పుడే అంటే చిన్నప్పుడే పిల్లలకు పొదుపుగా అంటే దుబారా లేకుండా ఎలా జీవించాలో నేర్పడం తల్లిదండ్రుల బాధ్యత అనుకొంటాను. కష్టపడి తెలివితేటలతో సంపాదించే డబ్బుని అప్పుడే ఎంజాయ్ చేయడం చేతనవుతుంది లేకపోతే డబ్బు దుబారా కావడం ఖాయం.

Leave a comment