నీహారికా,

ఈ మధ్య అందరి దగ్గరా క్రెడిట్ కార్డులు ఎక్కువగా వాడటం త్హో పొడుపు గ్రించిన ఆలోచన మనసులో నుంచి మాయం అయినట్లు అనిపిస్తుంది. సాధారణంగా సంపాదించిన నామములో  ఖర్చు పోనూ ఎంతో కొంత పొడుపు చేయడం మంచిదని ఆర్ధిక నిపుణులు సూచిస్తున్నారు. భవిష్యత్తు లో ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఈ పొడుపు సొమ్ము ఆడుకుంటుందనే భరోసా వుంటుంది. కానీ ఇవ్వాల్టి రోజుల్లో నిత్యవసర వస్తువులు, అవసరాలు, చదువులు, పెళ్ళిళ్ళు అన్నీ నిత్యావసర వస్తువులు అన్ని అదుపు తప్పి ఆకాశంలో నిలబడి వున్నాయి. ఇక పొడుపు సంగతి చెట్టెక్కుతుంది. కానీ ఎంతగా మనకి నచ్చజెప్పుకున్నాపైసా మిగల్చడం కష్టమైపోతుందని సరిపెట్టుకున్నా వయస్సు మళ్ళాక కావలసిన ఖర్చుల సంగతి ఏమిటి? అందరు గవర్నమెంట్ ఉద్యోగులు, పెన్షన్ సౌకర్యం వున్న వాళ్ళు కాదు కదా వార్ధక్యం, అనారోగ్యాలు, మందులు, బలమైన ఆహారం, అవసరాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏ కొంచెం అయినా పొడుపు చేయకపోతే చివరి రోజుల్లో పిల్లలపైన ఆధారపది, ఒకవేళ వాళ్ళు కుడా వసున్న ఆదాయం నుంచి తల్లి దండ్రులకోసం డబ్బు మిగాల్చలేదనటం భావ్యమా? వాళ్ళు మనలాంటి అవసరాలతో పెద్దవవ్వుతున్నవాళ్ళే కదా మరి ఇప్పుడు పొడుపు సంగతి అలోచించాలా? వద్దా?

Leave a comment