అక్షరం చీకట్లో వెలుగునిచ్చే జ్ఞానజ్యోతి.అటువంటి అక్షరం అనారోగ్యాలను నయం చేస్తుంది అని ఎన్నో మనోవైజ్ఞానిక పరిశోధనలు రుజువు చేస్తున్నాయి.కవిత్వం మనస్సు పరస్పరం ప్రభావితం చేసుకుంటాయి. మనసులో జరిగే ఘర్షణలు సంతోషాలు భావోద్వేగాలు కవిత్వంగా అక్షర రూపం దాలుస్తాయి .అక్షరాలుగా కనిపించే కవిత్వంలో నీబిడీ కృతమైన భావన పాఠకులలో చలనాన్ని తీసుకువచ్చి మమేకత్వాన్ని తెస్తుంది. అంటే తనలో ఉన్న భావన కూడా ఇదే అన్న ఐడెంటిఫికేషన్ ఇస్తుంది. రాసిన కవిలో కవిత్వం ఒక అవుట్ లెట్ లాగా మారి హృదయ భావాన్ని తగ్గిస్తుంది. ఇదే స్వాంతన పాఠకుల్లోను కలుగు తోంది అంతర్జాతీయ వైద్య సదస్సు ఈ అంశాన్ని ప్రస్థాపిస్తు రోగులకు వ్యాధుల వల్ల వచ్చే బాధను కవిత్వాన్ని ఉపయోగించి తగ్గించవచ్చుననీ,దానికి సమీకృతవైద్యం అని పేరు పెట్టి చికిత్సా విధానాన్ని కూడా రూపొందించి శిక్షణ ఇవ్వటం ప్రారంభించింది దీన్నే కావ్య చికిత్స,లేదా పొయిట్రీ థెరపీ అంటున్నారు.

చేబ్రోలు శ్యామసుందర్
9849524134

Leave a comment