నెల్లూరు జిల్లా వెంకటగిరిలో శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మకి ప్రసాదం నైవేద్యం పెట్టి చల్లని చూపులు తల్లి  ఆశీస్సులు అందుకొందాం.

పోలేరమ్మ గ్రామదేవత.భక్తులను ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడుతుంది.అమ్మవారికి జాతర సంబరాలు వైభవంగా జరుగుతాయి.దూర దూరంలో ఉన్న భక్తులు తమ కోరికు నెరవేరుతుంది ఇక్కడకు వచ్చి మొక్కలు  మొక్కుతారు.
అమ్మవారికి పసుపు,కుంకుమ కుండలతో సమర్పిస్తారు.ఊరేగింపుతో అమ్మవారిని వాడా వాడా లో  మేళతాళాలతో ఊరేగించి నిమజ్జనం చేస్తారు.కలరా వ్యాధితో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు అందుకే పోలేరమ్మకు ముడుపులు కట్టడం మొదలు పెట్టారు.తల్లి కటాక్షించి అందరినీ చల్లగా చూసింది.
అమ్మవారి జాతర ముందు రెండు సార్లు చాటింపు వేస్తారు.జాతర మొదలుపెట్టిన ఆ ఊరి ప్రజలు ఊరు నుండి వెళ్ళరాదు.
ఇష్టమైన రంగుల: అన్ని రంగులు ఇష్టమే
   ఇష్టమైన పూలు: అన్ని రకాల పుష్పాలు అంగీకరించును.
నిత్య ప్రసాదం: కొబ్బరి,పండ్లు.

 

         -తోలేటి వెంకట శిరీష

Leave a comment