రెండు చేతులతో వేయి పనులు సమర్థిస్తున్న మహిళలకు నిజామాజీనే వాళ్ళ సొంత పనులకు సమయం దొరకదు. ఈ ఫ్రెండ్ తోనో పది నిమిషాలు తీరికగా మాట్లాడటం మాట అటుంచి చివరకు ఉత్సాహాన్ని ఒత్తిడిని జయించే అవకాశాన్ని ఇచ్చే వ్యాయామం కూడా చేసేందుకు సమయం దొరకదు. స్త్రీలు వాయిదా వేయగలిగిన విషయం ఇదొక్కటే. అయితే పనులు చేస్తూనే వ్యాయామం చేయమంటున్నారు నిపుణులు. ఫోన్ లో నడుస్తూ మాట్లాడవచ్చు. ఎవరికైనా ఏదైనా చెప్పాల్సివస్తే నడిచివెళ్లి చెప్పచ్చు. పనిలో విరామం దొరికితే నాలుగు అడుగులు నడవచ్చు. కుర్చీలో కూర్చుని పాదాలను సవ్య అవసవ్య దిశల్లో గుండ్రంగా తిప్పటం చేతుల్ని మూసి తెరవటం గుండ్రంగా తిప్పటం పైకెత్తటం మెట్లు దిగటం లిఫ్ట్ ఉపయోగం తగ్గించటం ఇంట్లో టీవీ చూస్తున్నపుడు శరీరాన్ని వీలైనంత వంచి పనిచేయించటం ఇలా యాక్టివ్ గా ఉండే పనులు ఎన్నో మనం కూడా కొత్త పరిస్థితులు కనిపెట్టచ్చు. అదే పనిగా కూర్చున్నా బరువై పోతాం కదా.

Leave a comment