ఒక్క పూట కడుపు నిండా భోజనం దొరకని అన్నార్తులు ఈ ప్రపంచంలో ఎంతో మంది. ఇప్పటికే ఎన్నో స్వచ్చంద సంస్థలు,అన్నా దాతలు ముందుకు వచ్చి నిరుపేదలకు కడుపు నింపుతూనే ఉన్నారు. ఆలా వచ్చిన ఇంకో ఆలోచన రోటి బ్యాంక్ ఎవరైనా పేదలకు సాయం చేయాలనుకుంటే ఈ బ్యాంక్ లో డిపాజిట్ చేయవచ్చు. నిర్వాహకులు వాటిని సాయంత్రం వరకు పేదలు నిరోద్యోగులు రోగులకు సరఫరా చేస్తారు. ఎంతో మంది ఆహారం తెచ్చి ఇస్తూ వుంటారు. కల్యాణ మండపాల్లో మిగిలి పోయిన ఆహారం కూడా ఇక్కడికే చేరుతుంది. ప్రతి వారం 16 నగరాలలో 15000 రోటి బ్యాంక్ ల ద్వారా ఇండియాలో వందలాది మందికి ఆహారం అందుతోంది 365 మంది వాలంటీర్లు పని చేస్తున్నారు.

Leave a comment