సినిమా తారలు ఫిట్ నెస్ ప్లాన్ ఫాలో అవ్వుతుంటాము అంటుంటారు. అంటే పూర్తి శరీరాన్ని పరిగణలోకి తీసుకుని చేసే ప్లానింగ్ ఇది. శరీరం కండిషన్ చేసేందుకు రన్నింగ్, బ్రిస్క్ వాక్ మొదలుపెడతారు. స్కిప్పింగ్, జంపింగ్, జాక్స్ స్పాట్ జాగింగ్, స్విమ్మింగ్, డాన్సింగ్ వంటి వార్మింగ్ ఎక్స్ ర్ సైజులు, ఆసనాలు కండరాలకు టోనింగ్ ఇస్తాయి. రోజు సూర్య నమస్కారాలు చేయడం తో పూర్తి వ్యాయామం శరీరానికి లభిస్తుంది. శరీరం క్రింది భాగం కోసం స్క్వాట్స్, లెగ్ కిక్స్ చేయాలి. ఇవన్నీ శరీరానికి అలవాటు పడే వరకు ట్రెయినార్ల పర్యవేక్షణలో జరగాలి.

Leave a comment