Categories
సోషల్ మీడియాలో ఎన్నో విషయాలు వైరల్ అవుతున్నాయి.ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో విశేషాలు ఫేస్ బుక్ ,ఇన్ స్టా గ్రాంలో ప్రత్యక్షమై ఆనందపెట్టేస్తున్నాయి.స్పెయిన్ లోని కనరీ ఐలాండ్స్ లో కనిపించే నీలాకారం,నల్లని వల్కెనో రాళ్ళు బీచ్ మొత్తం పాప్ కార్న్ పోలిన రాళ్ళతో పరమ సుందర ప్రదేశం పాప్ కాన్ బీచ్ ఊహించినంత అందంతో ఎన్ని ఫోటోలు తీసినా ఎంతసేపు చూసిన తనివితీరని అందంతో కనిపిస్తుంది.ఈ చిత్రమైన బోటు స్పెయిన్ లో కేనరి దీవుల్లో ఉంది.ఒడ్డుకు కొట్టకొచ్చిన తెలుపు కోరల్స్ అలల తాకిడికి ఇలా పాప్ కార్న్ ఆకృతికి మారిపోతాయి. టూరిస్ట్ బ్లాగర్లు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ లు కారణంగా ఈ బీచ్ ఇప్పుడు గొప్ప పర్యాటక ప్రదేశం అవుతుంది.