చెన్నై లోని బీసెంట్ నగర్ లో నివసించే 92 సంవత్సరాల కామాక్షి సుబ్రమణియన్ పేరు చెబితే సైనికులు గుర్తుకు వస్తారు.  ఓల్కాట్ మెమోరియల్ లోని గ్రీన్ పార్క్ లో రక్షణ లేక  చెట్లు కొట్టేస్తున్నారు అనే సమస్య పైన ఆమె ఎనిమిదేళ్ల పాటు అధికారులతో పోరాడి దానికి అడ్డుగోడ సాధించారు. తమ ప్రాంతంలో చేసే రోడ్లు డ్రైనేజ్ వంటి పనుల్లో ఎలాంటి లోపాలు ఉన్నా ఆమె సహించరు ఇప్పుడామె త్వరలో అక్కడ జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీలో బరిలో నిలిచారు. ఈ పదవి కోసం పోటీ పడుతున్న అతి పెద్ద వయస్కురాలుగా ఆమె రికార్డుల్లో ఎక్కారు. గెలిచినా ఓడినా ప్రజా సమస్యలపై పోరాటం ఆపను అంటారు కామాక్షి.

Leave a comment