గోంగూర పేరు ఎత్తగానే ఆంధ్రా స్ఫెషల్ వంటలు గుర్తొస్తాయి.గొంగూరతో చేసే పప్పు ఎంతో రుచిగా ఉంటుంది.గోంగూరతో కలిపి చేసే నాన్ వెజ్ వంటకాలు అంతకంటే బావుంటాయి. రుచితో పాటు ఐరన్ పుష్కలంగా ఉంటుంది.ఐరన్ లోపం ఉన్నవారికి కొత్త రక్తం పట్టించడంలో తోడ్పడుతుంది గోంగూర.ఇందులో సీ విటమిన్ పుష్కలంగా ఉంటుంది.కనుక రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువే.తెలంగాణలో గోంగూరని పుంటి కూర అంటారు. నేత్ర దోషాలను గోంగూర మంచి ఔషధం. దీన్ని ఆకుకూరగానో,పచ్చడిగానో, ఊరగాయగానో వాడుకోవచ్చు. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించిమంచి కొలెస్ట్రాల్ ని పెంచుతుంది.విదేశాలకు కూడా మన గోంగూర పచ్చడి ఎగుమతి అవుతుంది.

Leave a comment