పిల్లలకు ఖరీదైన పిజ్జాలు,బర్గర్ లు ఇతర చిరుతిండ్లు ఇప్పిస్తే వాళ్ళకు ఆరోగ్యం ఇచ్చినట్లు కాదు. వాళ్ళకు సరైన పోషకాహారం ఇస్తేనే హుషారుగా ఉంటారు. తోటి పిల్లలతో స్నేహపూరితంగా ,ఎలాంటి ఉద్రేకాలు లేకుండా ఉంటాయి. పిల్లల మాట తీరు మన్ననగా చక్కగా ఉంటుంది. మూడేళ్ళ వయసులో మంచి పోషకాలు అందే పిల్లల్లో ఎదిగే కొద్దీ ఐక్యూ బావుటుంది. ఇదే పోషకాలు అందని పిల్లల్లో ఇందుకు వ్యతిరేఖ లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా చురుకు దనం లోపిస్తుంది. సరైన ఎదుగుదల కనిపించదు. పిల్లలు చిరాగ్గా ఎవరితో కలవకుండా ఉంటే వారి ప్రవర్తనకు సంబంధించిన ఏ లోపానికన్నా ,వాళ్ళలో పోషకాహార లేమి ప్రధాన కారణం అని అర్ధం చేసుకోవాలి.

Leave a comment