పోషకాహార లోపం వల్ల కూడా కంటినాడి పని తీరు తగ్గిపోతుంది అంటున్నారు  బ్రిస్టల్ విశ్వవిద్యాలయ నిపుణులు . దీన్ని న్యూట్రిషనల్ ఆప్టిక్ న్యూరోపతి అంటారు. చూసేందుకు ఎత్తు బరువు సరిగానే ఉన్న తినే తిండిలో పోషకాలు లోపించడంతో కంటిచూపు మందగిస్తుంది . చూపు దెబ్బతిన్న 16, 17 సంవత్సరాల వయసు వాళ్ళని చూస్తే వాళ్ళలో బి12, విటమిన్-డి ,కాపర్ సెలీనియం శాతాలు తక్కువగా ఉన్నాయని పరిశోధకులు చెపుతున్నారు . ప్రాథమిక దశలోనే దాన్ని పసిగట్టి వాళ్ళకు ఆ పోషకాలను సప్లమెంట్ల రూపంలో అందిస్తే కంటి చూపు మెరుగవుతుంది అంటున్నారు లేని పక్షంలో పూర్తి అంధత్వానికి దారితీసే ప్రమాదం ఉందంటున్నారు .

Leave a comment