ఔషధ గుణాలున్న ఆకుకూరల లిస్టులో ముందుంటుంది పుదీనా ప్రపంచ వ్యాప్తంగా దొరికే పుదీనాలో పద్దెనిమిది రకాలున్నాయి వంటకాలకు అదనపు రుచి, వాసనా ఇస్తుంది పుదీనా. దీన్ని కూల్ డ్రింక్స్ లో, ఔషదాల తయ్యారీ లో, సౌందర్య సాధనాల తయ్యారీలో ఉపయోగిస్తారు.  పుదీనా లో విటమిన్ ఎ,బి1, బి2, బి3, బి5, బి6, బి9 బీటాకెరోటిన్, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె వంటి విటమిన్లు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం సోడియం, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. పుదీనా రసం గొంతు నొప్పి తగ్గిస్తుంది కళ్ళకు చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. పుదీనా రైస్, పుదీనా చట్నీ, పుదీనా మజ్జిగా అందరికీ ఇష్టమైనవే.

Leave a comment