80 శాతం నీళ్లు ఉండే డ్రాగన్ పండు తింటే జీర్ణవ్యవస్థ బావుంటుంది. సి, ఎ, బి1, బి2, బి3 విటమిన్లు మెగ్నీషియం క్యాల్షియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉండటం తో ఈ డ్రాగన్ రోగనిరోధక శక్తిని ఇస్తుంది.డయాబెటిక్స్ రక్తంలో చక్కెర శాతం అదుపులో ఉంచుతుంది టమోటా ల్లాగే  డ్రాగన్ పండులో పుష్కలంగా లైకోపిన్ వల్ల చర్మం ముడతలు పడకుండా దెబ్బతినకుండా కాపాడుతుంది ఇది.ఏ వాతావరణంలో అయినా సులభంగా పెరుగుతోంది. డ్రాగన్ లో హైబ్రిడ్ రకాలు చాలానే ఉన్నాయి అందులో గులాబీ రంగు పై తొక్కతో ఎర్రని గుజ్జుతో హైలో సెరస్ పాలీరైజస్ రక్తం చాలా తియ్యగా ఉంటుంది.పువ్వు ఎంతో సువాసనతో ఉంటుంది.అర్ధరాత్రి వేళలో విచ్చుకుని ఉదయానికి ముడుచుకుపోతుంది.

Leave a comment