ఎండకాలం వస్తే బూడిద గుమ్మడితో వడియాలు పెడతారు. అలాగే ఒక వంతు గుమ్మడికాయ గుజ్జు, రెండు వంతులు పంచదారతో కలిపి పాకం పడితే గుమ్మడి సిరప్ తయారవుతుంది. ఫ్రెటో న్యూట్రియంట్లు గుమ్మడిలో పుష్కలంగా ఉంటాయి. ఇందులో అధికంగా ఉండే ఇనుము ఏకాగ్రతను జ్ణాపకశక్తిని పెంచుతుంది. పొటాషియం, విటమిన్ సీ లు ఎక్కువగా ఉండే గుమ్మడిలో శరీరానికి కావలిసిన విటమిన్ సీ అవసరాన్ని చాలావరకు తీరుస్తుంది. వ్యాది నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో వ్యర్ధాలను మూత్రం రూపంలో బయటకు పంపుతుంది. కేలరీలు తక్కువ పీచు ఎక్కువ. బరువు తగ్గాలనుకునే వారికి అమృతం వంటి ఆహారం గుమ్మడి. గుమ్మడి హల్వా చాలా బావుంటుంది.

Leave a comment