తాలింపులో ఆవాలతో పటు జీలకర్ర కూడా వాడతారు . కానీ ఈ జీలకర్ర వాడకం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది జీర్ణక్రియ రేటును వేగవంతం చేస్తుంది . జీలకర్రతో  చేసిన టీ తాగితే కడుపు ఉబ్బరం తగ్గుతుంది . ఇందులో పీచు ఎక్కువ . జీర్ణవ్యవస్థ సక్రమంగా జరిగేందుకు అవసరం అయ్యే ఎంజైముల ఉత్పత్తికి సహకరిస్తుంది . జీలకర్ర లో ఉండే యాంటీ బాక్టీరియల్ ,యాంటీ ఇన్ ప్లేమేటర్ గుణాలు జలుబు దగ్గును నివారిస్తాయి . ఇందులో ఇతర పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచి  ఇన్ పెక్షన్ల తో పోరాడేలా చేస్తాయి . గర్భిణీలో సాధారణంగా కనబడే వికారం జీలకర్ర నివారిస్తుంది . బాలింతలు తీసుకొంటే పాలవృద్ది బావుంటుంది .

Leave a comment