కొన్ని శారీరక లక్షణాలు పోషకాల లోపానికి సంకేతాలంటారు డాక్టర్లు. కాలి పిక్కలు పట్టేస్తే అది కాళ్లలో నొప్పులు అంటూ ఉంటే అది మెగ్నీషియం ,కాల్షియం,పొటాషియం లోపంగా చూడమంటున్నరు. ఈ పోషకాలు లోపిస్తే నొప్పులు రావచ్చు అంటున్నారు.పెదవుల చివర్లు తరచూ పగులుతుంటే అది జింక్,ఇనుము,బి12 విటమిన్లు లోపం కావచ్చు. నాలుక,పెదవులు,పొడిబారి తెల్లగా కనిపిస్తే బీ విటమిన్ లోపంగా పరిగణించాలి. గోళ్ళు పగిలినా ,గీతలుగా కనిపించిన జింక్ పోషకం తగ్గిందని అర్ధం. జింక్ స్ధాయిలు తగ్గిపోతే వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. దానితో ఇన్ ఫెక్షన్ లు దాడి చేసి ఆ ప్రభావం గోళ్ళపై పడుతుంది.

Leave a comment