ఉప్పంటే రుచికోసం కూరల్లో వాడే తెల్లని ఉప్పు ఒక్కటే కాదు ఎన్నో గుణాలు కలిసిన పహాడీ ఫ్లేవర్డ్ సాల్ట్ లు ఉన్నాయి. సముద్ర జలాలతో చేసే ఉప్పు తో పోకొండల్లోంచి తవ్వి తీసిన ఉప్పుల్లో ఖనిజాల శాతం చాలా ఎక్కువ.ఉత్తరాఖండ్ వాళ్ళు అక్కడి కొండల్లోని హిమాలయన్ రాక్ సాల్ట్ గా వాడుతారు. ఇది గులాబీ రంగులో ఉంటుంది. ఈ పింక్ సాల్ట్ కి తులసి,పుదీనా,కొత్తిమీర,మెంతి,ఆవ వంటి ఔషధ మొక్కలు లవంగాలు,చెక్క మిరియాలు,సోంపు జీలకర్ర వంటి మసాలా దినుసులు కలిపి రోల్లో మరి కలిపి ఆరబెట్టి వాడుకుంటారు అక్కడి వాళ్ళు ఇప్పుడా రుచి ప్రపంచానికి తెలిసింది పహాడీ ఫ్లేవర్డ్ సాల్ట్ లు మార్కెట్లో కొచ్చి మన దేశం లోనే కాదు విదేశాలకు పోతున్నాయి.

Leave a comment