ఉసిరిని ఆమ్లా, ధాత్రీఫలం అని పిలుస్తారు. ఇది గబగబా కొరికి తినేసే పండు కాదు. పులుపుగా వుంటుంది కదా, కానీ కమలా తో పోలిస్తే విటమిన్-సి 20 రెట్లు ఎక్కువ. ఇతర పండ్ల కన్నా యంటి ఆక్సిడెంట్లు ఎక్కువే అన్ని అవయవాలు సమన్మయం తో పని చేసేలా చేస్తుంది. వేసవిలో ఈ ఉసిరి జ్యూస్ చాలా మంచిది. ఎన్నో పోషకాలున్న ప్రక్రుతి ప్రసాదం ఉసిరిని మురబ్బాల గానూ, నిల్వ పచ్చడిలాగో ఎలా తిన్నా పర్వాలేదు. వేరు నుంచి చిగురు వరకు ప్రతీది ఔషదమే. ఈ ఉసిరి పొడి క్యాండీలు రసం రూపంలో విక్రయిస్తున్నారు. ఇందులో వుండే క్రోమియం ఇవ్వాల్సిన స్రావాల్ని ప్రేరేపిస్తుంది. ఫలితంగా రక్తంలో చెక్కర నిల్వల్ని తగ్గిస్తుంది. ఆధ్యాత్మిక భావాల్ని,  ఔషద గుణాన్ని పోషకాలను ఏకకాలంలో అందరికి ఈ ఉసిరిని రసం రూపంలో దొరికినా రోజురెండు స్పూన్లు తాగడం మంచిదే.

Leave a comment