పోషకాలు పుష్కలంగా ఉండే శనగలను దేశి సూపర్ ఫుడ్ అంటున్నారు ఆహార నిపుణులు. శ్రావణ మాసపు నోముల్లో గుళ్ళలో ప్రసాదాల్లో నానబెట్టిన శనగలు ప్రసాదం. రోగాలు చుట్టుముట్టే ఈ రోజుల్లో సెనగలు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఈ ఆహారం వెనుక ఆంతర్యం పూజల్లో చేసే ఉపవాస లో నీరసం రాకుండా సెనగలు శక్తిని ఇస్తాయి. వీటిలోని కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎముకలు కండరాలు బలంగా తయారవుతాయి. ఐరన్ లోపం ఉంటే శనగలు మంచి పోషకాహారం. మొలకలు వచ్చిన శనగలు టీ స్పూన్ త్రిఫల చూర్ణం తో కలిపి తింటే చర్మం పైన వచ్చే తెల్ల మచ్చలు తగ్గుతాయి అని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు.

Leave a comment