ప్రెషర్ కుక్కర్ కంటే బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటారు. కుక్కర్ లో అన్నం పొడిగా వుండదనో, పప్పు చాలా మెత్తగా అయిపోయిందనో ఇంకోటి ఇంకోటో వంకలు పెడతారు కానీ ప్రెషర్ కుక్కర్ ఉపయోగాలు గుర్తుచేసుకుంటే దాన్ని వదలరు. బ్రౌన్ రైస్ కుక్కర్ లో వుడికేందుకు 20 నిముషాలు పడుతుంది. బీన్స్ అయితే 10-12 నిమిషాలు, క్యారెట్స్ రెండు నిమిషాలు, బనలదుంపలకు ఐదు నిముషాలు సమయం పడుతుంది. విడిగా వండటం కంటే కుక్కర్ లో పావు వంతు సమయం అదనే. ఇంధనం కూడా తక్కువగానే ఖర్చవుతుంది. ఇంతే కాకుండా పదార్ధాల లోని పోషకాల రుచి బయటకు పోకుండా ఉంటాయి. ఆరోగ్యకరమైన రుచికరమైన ఆహారం వండుకోవచ్చు. అలాగే గింజ ధాన్యాలు దుంపలు బీన్స్ కుక్కర్ లో వండటమే సులభం. బేకింగ్ కోసం కుక్కర్ను వాడచ్చు. కుక్కర్ తర్వాత ఎన్నో రకాల ఆధునికమైన కుకింగ్ యూనిట్స్ వచ్చిన ప్రెషర్ కుక్కర్ తర్వాత ఎన్నోరకాల ఆధునికమైన కుకింగ్ యూనిట్స్ వచ్చిన ప్రేషర్ కుక్కర్ కంటే అవేమీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించ లేననే చెప్పొచ్చు.

Leave a comment