ఈ రెండు నెలల వేసవి సెలవుల్లోనే పిల్లల ఇంటి పట్టున వుంటారు కనుక వాళ్ళకు మంచి భోజనం, మంచి తినుబండారాలు వాళ్ళు శక్తిని పెంచే ఆహారం ఇవ్వాలనిపిస్తుంది తల్లులకి. పిల్లలకు తక్షణ శక్తి నివ్వడంలో కీలక పాత్ర పోషిస్తాయి ఓట్స్, పీచు, పిండి పదార్ధాలు ఎక్కువగా వుంది వాళ్ళకి పోషకాలు అందిస్తాయి ఓట్స్. రోజు అల్పాహారంగా పాలతో మజ్జిక తో వాళ్ళకు ఇవ్వొచ్చు. పిల్లలుకదా ఇస్తాపదరేమో అనుకుంటే బాదాం, చాక్లేట్, చెర్రి పండ్లు, డ్రై ఫ్రూట్స్ ,యాలుకల పొడి మొదలైనవి కలిపి రుచిగా ఉండేలా చేసి ఇవ్వొచ్చు. ఆటల్లో చురుకుదనం కోసం వాళ్ళకు శక్తిని ఇవ్వడం కోసం గుడ్లు ఎదో ఒక రూపంలో ఇవ్వాలి. అలాగే వాళ్ళకి జ్ఞాపక శక్తి పెరుగుదల కోసం పొటాషియం అందాలి. అరటి పండ్లు సరైన ఎంపిక. దీన్ని తిననని మారం చేస్తే ఫ్రూట్ సలాడ్ గా, మిల్క్ షేక్ లా వివిధ రూపాల్లో ఇస్తే ఇష్ట పడతారు. మాంసాహారం తినే పిల్లలకు చేపలు తినేలా చూడాలి. అలాగే ముందు ముఖ్యంగా ఆటల్లో అది అలిసే పిల్లలకు, ఈ వేసవిలో మొదటి ఆహారం మంచినీళ్ళు ఎన్ని తాగితే అంత మంచిది. లెమన్ కలిపి ఇస్తే సి-విటమిన్ కూడా అంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఏ ఆహారాన్ని అయినా కళ్ళకింపుగా, నోటికి రుచిగా వాళ్ళు మెచ్చేదిలా తీర్చి దిద్ది రకారకాల రూపాల్లో ఇవ్వాలి.
Categories
Wahrevaa

పోషకాలున్న ఫుడ్ ని వాళ్ళకి నచ్చేలా ఇవ్వండి

Leave a comment