వర్క్ అవుట్స్ తో పాటు పొటాషియం తీసుకుంటేనే శరీరం శక్తిని నింపుకుంటుంది. వర్క్ అవుట్స్ తో కండరాలు అలిసిపోకుండా నొప్పులు రాకుండా పొటాషియం సహాయం చేస్తుంది. రోజువారి ఆహారంలో మనిషికి 4700 మిల్లీ గ్రాముల పొటాషియం అవసరం. ఇది పండ్లు కూరగాయలలో లభిస్తుంది రోజు ఐదు సార్లు తప్పని సరిగా వాటిని తీసుకోవాలి. డైటీషియన్లు సలహా ప్రకారం ఒక అవకాడో లో 690 మి. గ్రా,పావుకప్పు ఎండా బెట్టిన ఆప్రికాట్ లో 378 మి. గ్రా,ఒక చిలకడదుంపలో 438 మి. గ్రా,ఒక కప్పు ఉడికించిన బ్రోకలీ 475 మి. గ్రా కర్బుజాలో 427 మి. గ్రా,పాల పదార్దాలో కూడా పొటాషియం లభిస్తుంది. పెరుగు కొవ్వు తక్కువ పాలు ప్రతి పూట తీసుకోవాలి ఈ పోషకమైన ఆహారం ద్వారా శరీరానికి చేరితేనే ఆరోగ్యం అంటారు డాక్టర్లు.

Leave a comment