నడుస్తుంటే పరిగెత్తుతుంటె ఉన్నట్టుండి కాళ్ళు ,పాదాలు,కండరాలు పట్టేసినట్లు అయిపోయి నొప్పిగా ఉంటుంది. ఈ స్టిఫ్ నెస్ కి కారణం శరీరంలోని పొటాషీయం లోపం వల్లనే అంటారు ఎక్స్ పర్ట్స్. పోటాషీయం ఎక్కువగా ఉండే అరటి పండు,బంగాళ దుంప,బీన్స్,నిమ్మజాతి పండ్లు పండ్ల రసాలు ఆహారంలో భాగంగా తీసుకుంటే ఈ సమస్య పోతుంది అంటున్నారు. ఒక వేళ నొప్పి వస్తే కండరాలను మరింత అలసటకు గురి చేయరాదు. కాళ్ళు పాదాలు మృదువుగా మాసాజ్ చేయాలి. వేడినీటితో కాపడం పెట్టాలి.

Leave a comment