పోతరాజు అంటేనే భయం భయంగా ఉంటుంది కదా!! వేషధారణ కూడా భయం.

మరి సఖులు!! ఈ రోజు మన పోతన్నకు ఇష్టమైన ప్రసాదం నైవేద్యం పెట్టి అందరినీ చల్లగా చూడమని మళ్లీ వచ్చే సంవత్సరానికి రమ్మని పంపిద్దాం.
వరంగల్ జిల్లా సమీపంలోని గ్రామంలో ఏడుగురు అక్క చెల్లెళ్ళకి ఒక సోదరుడుగా జన్మించాడు లింగం.ఆ గ్రామాన్ని పాలించే ప్రభువు ఏడుగురు అక్కచెల్లెండ్ల ని చెర పట్టి పరాభవించాడు.అప్పుడు లింగం ఉగ్రుడై ఆ ప్రభువుని సంహరించి నెత్తురు ఒంటికి రాసుకుని, ప్రేగులను మెడలో వేసుకుని ఊరంతా తిరుగుతూ రంకెలు వేస్తూ…తల్లులను పరాభవిస్తే ఇదే గతి పడుతుంది అని హెచ్చరించాడు.
మరి భక్తులకు ఇంత రక్షణగా ఉంటున్న లింగంను అందరూ పోతురాజు అని పిలవబడి క్రమంగా పోతరాజైయాడు.

ఆయనకు సజీవంగా వున్న కోడిని నోటితో పట్టి అమ్మవారికి సమర్పించుట ఇష్టం. దీనినే గావు పట్టటం అంటారు.చివరి ఘట్టం మరి రంగం కార్యక్రమం.ఈ రోజు శివసత్తుల నృత్యాలు, అమ్మ భవిష్యవాణి గురించి చెప్పడం.ఆషాఢమాసం అంతా గ్రామదేవతల పూజలతో కటాక్షం కోరుకున్నాం కదా!!పదండి శ్రావణ మాసంలో కి అడుగు పెడదాం!!

 

-తోలేటి వెంకట శిరీష 

Leave a comment