శరీరం మొత్తం సమంగా బాగానే ఉన్నా పొట్ట ముందుకు కనబడుతూ ఇబ్బంది పెడుతోందని చాలా మంది సమస్య. ఎంత వ్యాయామాలు చేసిన పొట్ట బరువు తగ్గడం లేదంటే, దాన్ని పక్కనపెట్టి ఏం తినాలో ముందు తెలుసుకోవాలి. పూర్తి ఫ్యాట్ ఉన్న పెరుగు లేదా ఏ మాత్రం కొవ్వులేని పెరుగు, రెగ్యులర్ పెరుగయినా సరే ప్రో బయోటిక్స్ పుష్కలంగా ఉండి జీర్ణశక్తి కాస్త మెరుగుపరుస్తుంది. అలాగే అనాసపండులో బ్రోమెలెయిన్ అనే ఎంజాయిమ్ జీర్ణ శక్తిని పెంచి కడుపు పెరగకుండా చేస్తుంది. బొప్పాయి వంటి ఇతర పండ్లతో సలాడ్ చేసి తినాలి. అల్లం, పిప్పరమెంట్ వాడాలి. హాట్ లేదా ఐస్డ్ అల్లం లేదా పిప్పర్ మెంట్ టీ తాగితే అనవసరపు క్యాలరీలు జతకావు. జీర్ణ శక్తి కూడా మెరుగవుతుంది. ఇలాంటి పదార్ధాలు భోజనంలో భాగంగా వుంటే ఉదరం బరువు క్రమంగా తగ్గిపోతుంది.

Leave a comment