ఇన్ ఫెక్షన్ల తో పోరాడే విషయంలో బాదం గింజలు అచ్చం ఔషధం లగే పని చేస్తాయి. ఈ గింజలను నానపెట్టి తింటే దానిపై చర్మం మెత్తగా తినేందుకు వీలుగా ఉంటుంది. అయితే ఆ పొట్టు తీసేయకూడదు. పొట్టు తీసేస్తే గింజల్లో ఉండే వ్యాధి నిరోధక,యాంటీ వైరల్ గుణాలు శరీరానికి అందకుండా పోతాయి. వీటిలో మోనో ఆన్ సాచురేటెడ్ ఫ్యాట్స్ మెండుగా ఉంటాయి వీటిని శరీరం త్వరగా జీర్ణం చేసుకొంటుంది. ఇవి మంచి కొవ్వులు చెడు కోలెస్టరాల్ ను తగ్గిస్తాయి. ఈ గింజల్లో పొటాషియం ఎక్కువగా సోడియం తక్కువగా ఉంటుంది. అధిక రక్తపోటు తో బాధపడే వాళ్ళు వీటిని తీసుకొంటే మంచిది. రోజుకో ఐదారు బాదం గింజలు తింటే ఆరోగ్యం.

Leave a comment